యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ దసరా కు రిలీజ్ కానుంది.  ఈ ఏడాది రిలీజ్ కానున్న లాస్ట్ బిగ్ టికెట్ ఫిలిం ఇదేనని కూడా దీనికి మరో ఘనత ఉంది. ‘బిగ్ టికెట్ ఫిలిం’ అని ఇంగ్లీష్ ఏంది అనుకుంటున్నారా…  భారీ కాంబినేషన్ – భారీ బడ్జెట్ ఉన్న చిత్రాలను బిగ్ టికెట్ ఫిలిమ్స్ అంటారు. ఈ ఏడాదిలో ఈ సినిమా తప్ప ఇకపై టాప్ లీగ్ స్టార్ ల సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కావడం లేదు.. సో.. యంగ్ టైగర్ సినిమాతో ఈ ఏడాది కి మీరు గుడ్ బై చెప్పాల్సిందే.

మరి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ పై కూడా అందరికీ చాలా ఆసక్తి ఉంది. సెప్టెంబర్ 20 న ఆడియో లాంచ్ ఈవెంట్ చేస్తారని మొదట్లో అనుకున్నారు. ఆ తర్వాత ఈవెంట్ లేకుండా డైరెక్ట్ గా ఆడియోను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంతలో అరవింద టీమ్ ఆడియో టీజర్ డేట్ ను అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.  పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.. కానీ ఇక్కడ టాపిక్ ఎన్టీఆర్ లుక్ కాదు కాబట్టి అది పక్కన పెడదాం.  ఆడియో ను సెప్టెంబర్ 20 న రిలీజ్ చేస్తామని అన్నారు గానీ.. ఈవెంట్ మాత్రం లేదట.

జస్ట్ యూట్యూబ్ లో – ఇతర పాపులర్ మ్యూజిక్ వెబ్ సైట్స్ లో మాత్రం ఆడియో ను డైరెక్ట్ గా విడుదల చేస్తారు. అంతే. ఇవన్నీ సరే గానీ అసలు ఆడియో ఫంక్షన్ ఎందుకు చేయడం లేదు?  నాన్నగారు ఈమధ్యే కాలం చేయడం తో ఎన్టీఆర్ కు ఇలా గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం లేదట. అందుకే వద్దని వారించాడట.  ప్రమోషన్స్ ఎలాగూ తప్పవు కాబట్టి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం తన అంగీకారం తెలిపాడట. అదండీ సంగతి.