అమెరికా తూర్పుతీరాన్ని ‘ఫ్లోరెన్స్ హరికేన్’ వణికించింది. ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న అలలతో కరోలినా రాష్ట్రం తీర ప్రాంతాలను వరద ముంచెత్తింది.  దాదాపు 2 మీటర్ల మేర నీరు నిలిచి జనావాసాలన్నీ నీటి మునిగాయి.   ఫలితంగా లక్షలాది గృహ సముదాయాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.  దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నార్త్ కరోలినా – ఎమరాల్డ్ ఐజిల్ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు జలమయ్యాయయని తెలిపారు. దాదాపు 2 మీటర్ల లోతు నీళ్లలో జనావాసాలు మునిగిపోయాయని అమెరికా వాతావరణ శాఖ అధికారులు తాజాగా తెలిపారు.

కాగా అమెరికాను ఫ్లోరెన్స్ హరికేన్ అల్లకల్లోలం చేయనుందని – భారీ నష్టం సంభవిస్తుందని  నేషనల్ హరికేన్ సెంటర్ ముందుగానే అప్రమత్తం చేసింది.  అయితే ప్రాణ నష్టం తగ్గించేందుకు అందరూ ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. జనాలను కూడా అధికారులు తరలించారు. నీటిలో మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి సాయమైనా అందించేందుకు భద్రతా దళాలను రంగంలోకి దించారు. ఈ తుఫాన్ నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. ప్రాణాలు పోయాయా అనే దానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.