అరవింద సమేత వీర రాఘవ కోసం కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొక్క ఐదు రోజులు గడిస్తే చాలు యంగ్ టైగర్ విశ్వరూపం చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. గురువారం ప్రీమియర్ షోల కోసం థియేటర్ యజమానులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేసారు. ప్రస్తుతం అనుమతుల ప్రహసనం కొనసాగుతోంది. ఇదిలా ఉంచితే అరవింద సమేత వీర రాఘవ ఫ్యాక్షన్ డ్రాప్ లో రూపొందిన ఫక్తు యాక్షన్ డ్రామా మూవీగా ఇప్పటికే క్లారిటీ వచ్చేసినా అది ఏ మోతాదులో ఉంటుంది అనేది అంతుచిక్కడం లేదు. నిజానికి ఈ జానర్ తారక్ కు కొత్త కాదు.

కెరీర్ లో ఫస్ట్ బ్రేక్ గా ఎప్పటికి మర్చిపోలేని ఆది రూపొందింది ఇలాంటి లైన్ మీదే. ఆ తర్వాత సాంబతో ఓసారి దమ్ముతో ఓసారి ప్రయత్నించారు కానీ ఆ రేంజ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాయి. వాటిలో ఎమోషన్ కంటే యాక్షన్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మాస్ కు కిక్కిచ్చే ఫైట్లు ఎన్ని ఉన్నా ఎమోషన్ మాత్రం అంతగా పండేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాను వేరని ఋజువు చేయాలి.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా హెవీ వెయిట్ తో తీసాడట త్రివిక్రమ్. ట్రైలర్ లో కేవలం శాంపిల్ మాత్రమే చూపించాడు కానీ నిజానికి ఊహకందని బరువైన సీన్లు ఇందులో చాలా ఉంటాయట. అందుకే పెనివిటి పాటను ప్రత్యేక శ్రద్ధతో రాయించడం కంపోజ్ చేయించడం జరిగిందట. అత్తారింటికి దారేది లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్ క్లైమాక్స్ లోనే కంటతడి పెట్టించిన త్రివిక్రమ్ ఇలాంటి ట్రాజెడీ ఎమోషన్ కు స్కోప్ ఉన్న చోట వదిలేస్తాడా. ముఖ్యంగా నాగబాబు చితికి నిప్పు పెట్టే సీన్ కు ప్రేక్షకులు కంటతడి పెట్టడం ఖాయమంటున్నారు యూనిట్ సభ్యులు.

దీని గురించే మొన్న ప్రీ రిలీజ్ లో తారక్ ప్రస్తావించాడు కూడా. సో నరుక్కోవడం చంపుకోవడమే కాక గుండెలు పిండేసే ఎమోషన్ ని జూనియర్ ఎన్టీఆర్ ఓ రేంజ్ లో చూపించడం వల్లే పోస్టర్స్ లో అంత సీరియస్ గా కనిపిస్తున్నాడట. జై లవకుశ సక్సెస్ తర్వాత ఏడాది తర్వాత వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి. ఇవాళ సాయంత్రం పెనివిటి వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయబోతున్నారు