ట్రైలర్ దేవదాస్

ట్రైలర్ దేవదాస్

ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షుకుల్లో క్యూరియాసిటీని పెంచిన ‘దేవదాస్’ టీమ్ ఈ రోజు ట్రైలర్ తో వచ్చారు.  “అంతా భ్రాంతియేనా..” పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటే నాని తన క్లినిక్ లో దిగాలుగా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ షాట్ లో నానిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోతారు.  ఇక అలా ఎందుకు జరిగింది అనేది సస్పెన్స్..!

ఇక నాగ్ “తన పేషెంట్ ని” అంటూ విలన్ గ్యాంగ్ కు పరిచయం చేసుకున్నాడు.  ఇక డాన్ నాగ్.. డాక్టర్ నాని లు ఎందుకు కలిసి ఉన్నారనే విషయం సస్పెన్స్ గా ఉంచుతూనే వాళ్ళ మధ్య జరిగిన ఫన్నీ సీన్స్ చూపించారు.   నాగ్ ‘చీర్స్’ అంటూ పెగ్గేస్తుంటే నాని తన బీపీ ని బీపీ మిషన్ తో తనే చెక్ చేసుకోవడం.. ఫ్రస్ట్రేషన్ లో “ఇలా రోజూ వచ్చి మందు కొట్టడం ఏం బాలేదు” అని అరవడం.. సిట్యుయేషనల్ కామెడీనే.   పెగ్ ఫాస్ట్ గా లేపేసి “ఒకే నేనిక వెళ్ళొచ్చా” అని అడిగితే “చీర్స్ కొట్టకుండా తాగేశావేంట్రా?”  అంటూ నాగ్ ఝలక్ ఇస్తాడు.  ఇలా రచ్చగా సాగింది వాళ్ళ రిలేషన్.

నాగార్జున లవ్ డాక్టర్ అవతారం ఎత్తి స్టెతస్కోప్ తో నాని చెక్ చేస్తూ ‘నీ ప్రాబ్లెం ఏంటో తెలుసా?” అనగానే ఇక నాని లవ్ సీన్స్ స్టార్ట్.   “అయినా నీలాంటివాడికి ప్రేమంటే ఏం తెలుస్తుంది చెప్పు!” అంటూ నాగ్ ని చూసి పకపకా నవ్వుతాడు.. ఇక అక్కినేని వారు తమ రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీస్తారు.   అంతా ఫన్నే కాదు.. సీరియస్ మాఫియా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నాగ్ అలా లెఫ్ట్ హ్యాండ్ తో గన్ ని స్టైల్ గా తిప్పడం స్టైలిష్ జెస్చర్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి.   యాక్షన్ సీన్స్ లో యంగ్ & ఎనర్జిటిక్ నాగ్ మళ్ళీ కనిపించాడు. ఇక నాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టెప్స్ కూడా ఇరగదీశాడు.

టోటల్ గా 100% కమర్షియల్ ఎంటర్టైనర్ చూడబోతున్నమనే ఫీల్ ఇచ్చింది ట్రైలర్.  సెప్టెంబర్ 27 కి బుకింగ్ చేసుకోవడం మర్చిపోవద్దే… ప్రతివారం ఇలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాదు కదా!

ఫస్ట్ లుక్: థగ్స్

ఫస్ట్ లుక్: థగ్స్

మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ అలెర్ట్ గా.. స్టెడీగా మారిపోతారు.  ఏం కొత్తదనంతో మనల్ని థ్రిల్ చేయబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు.  ఆమిర్ ఖాన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండండంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుండి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్  ను ఆమిర్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశాడు.

దానికి ‘ది బిగ్గెస్ట్ థగ్ ఆఫ్ ఆల్’ (అందరికన్నా పెద్ద బందిపోటు) అనే సూపర్ క్యాప్షన్ ఇచ్చాడు.  నడి సముద్రంలో నల్లటి మబ్బులు ముసురుకొని ఉంటే ఒక పక్షి అలా ఎగురుతూ ఒక ఓడ పైకి వస్తుంది.. ఆ ఓడలో ఫిరంగి అంచుపైన వాలుతుంది..  పక్కనే అమితాబ్ బచ్చన్  యుద్దానికి సిద్ధం అన్నట్టుగా ఒక చేత్తో ఖడ్గం తో ఠీవిగా నిలబడి ఉంటాడు.  ఫైనల్ గా అమితాబ్ క్యారెక్టర్ పేరు ఖుదాబక్ష్ అని రివీల్ చేశారు.   పాతకాలం నాటి ఓడ బ్యాక్ గ్రౌండ్.. పైన కారుమబ్బులు.. ఈ లొకేషన్ తో పాటు బిగ్ బీ గెటప్ అదిరిపోయింది.. తలపాగా.. పొడవాటి జుట్టు.. గెడ్డం మీసాలు.. అసలు అమితాబ్ లుక్ సూపరంటే సూపర్.  ఇక అజయ్ అతుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది.

ఈ సినిమాకు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకడు.  1839 కాలం నాటి ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో కత్రినా కైఫ్ – ఫాతిమా సనా షేక్ – రోనిత్ రాయ్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నఈ  సినిమాను నవంబర్ 8 న దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Pyaar Prema Kaadhal Movie Trailer

Pyaar Prema Kaadhal Movie Trailer

నిన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ప్యార్ ప్రేమ కాదల్ ట్రైలర్ యూత్ ని టార్గెట్ చేసినట్టుగా దానికి వస్తున్న స్పందనను బట్టే చెప్పొచ్చు. ఒక బుద్ధిమంతుడైన హీరో ఆధునిక అమ్మాయికి ప్రతిరూపంగా నిలిచే హీరోయిన్  సంప్రదాయంగా ఉండే హీరో తల్లి తండ్రులు వీళ్ళ మధ్య ఒక ఆసక్తికరమైన అంశంతో దర్శకుడు ఎలాన్ రూపొందించిన ఈ సినిమా కొంతకాలం క్రితమే తమిళ్ లో విడుదలై మంచి విజయం దక్కించుకుంది. కాస్త ఆలస్యంగా అయినా అదే పేరుతో తెలుగులో తీసుకొస్తున్నారు. యువాన్ శంకర్ రాజా అందించిన సంగీతం కోలీవుడ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక్కడ కూడా అదే ఫలితాన్ని ఆశిస్తున్నారు నిర్మాతలు. హరీష్ కళ్యాణ్ రైజా జంటగా నటించిన ఈ మూవీలో ఈ ఇద్దరు తప్ప ఇంకెవరిని పెద్దగా హై లైట్ చేసినట్టు కనిపించడం లేదు. హీరో పాత్రను అమాయకంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది.

ఈ మధ్య హీరొయిన్ క్యారెక్టరైజేషన్ ను బోల్డ్ గా మలుస్తున్న దారిలోనే ఎలాన్ కూడా వెళ్ళాడు. దేనికి మొహమాట పడకుండా తనను ప్రేమించినవాడితో బెడ్ పంచుకోవడానికైనా నేరుగా ఫ***గ్ అంటూ తిట్టడానికైనా ఏ మాత్రం వెనుకాడని పాత్రలో రైజా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా మారేలా ఉంది. హీరో హరీష్ కళ్యాణ్ సింపుల్ గా బాగున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యువాన్ చాలా రోజుల తర్వాత మేజిక్ చేసినట్టు అనిపిస్తోంది. ఆధునిక ప్రేమలను చూపించిన ఈ ప్యార్ ఇష్క్ కాదల్ కు విజయ్ మొరవనేని-యువన్ శంకర్ రాజా సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి ట్రెండీ ప్రేమ కథలకు మంచి ఆదరణ దక్కుతున్న నేపధ్యంలో ఈ ప్యార్ ప్రేమ కాదల్ యూత్ ని మెప్పిస్తే మటుకు మంచి వసూళ్లే రాబట్టుకోవచ్చు. త్వరలో విడుదల ప్లాన్ చేసిన ప్యార్ ఇష్క్ కాదల్ పూర్తి ఆడియో ఈ వారంలోనే విడుదల కానుంది.

Hello Guru Prema Kosame Teaser

Hello Guru Prema Kosame Teaser

ఎనర్జిటిక్ హీరో రామ్ – అనుపమ పరమేశ్వరన్లు జంటగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే’.  దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితమే రిలీజ్ అయింది.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తల స్నానం చేసి తీరిగ్గా తన పొడవాటి జుట్టుకు సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉంటుంది. ఇక హీరో రామ్ అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ నడుస్తూ వచ్చి అనుపమను చూస్తాడు. సెక్సీ గా ఉన్న అనుపమ ను వెనక వైపునుండి చూసేసరికి వెయ్యి వోల్టుల షాక్ తగిలినట్టుగా అవుతుంది.. ఆటోమేటిక్ గా మత్తు వదులుతుంది. ఇక రామ్ ఉన్న వైపు తిరగకుండానే ‘చూశావా?’ అడుగుతుంది. ఇక సూపర్ ఎక్స్ ప్రెషన్ తో అవునన్నట్టుగా తలూపుతాడు. ‘నీ కోసమే’ అంటుంది.. రామ్ షాక్ అవుతాడు. అప్పుడు వెనక్కి తిరిగి ‘కాఫీ’ అని పంచ్ డైలాగ్ వేస్తుంది.  ఇక పక్కనున్న టేబుల్ పై కాఫీ ని చూస్తాడు.   లేచి నిలబడి చీర సరిచేసుకుంటూ ‘ఎలా ఉంది?’ అని అడుగుతుంది.  అదోలా అనుపమను చూస్తూ ‘హాట్ గా ఉంది..  ..కాఫీ’ అంటూ కౌంటర్ ఇస్తాడు.

జస్ట్ 39 సెకన్లే ఉంది టీజర్.  కానీ సూపర్ రొమాంటిక్.  దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కమ్ముల మంచి  కాఫీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే నక్కిన గారు హాట్ కాఫీతో అలా  పని కానిచ్చారు. అసలే వానాకాలం నుండి శీతాకాలనికి వాతావరణం మారుతోంది.  నక్కిన క్లైమేట్ చూసి మరీ హాట్ కాఫీతో ప్రేక్షకులను నొక్కుతున్నాడన్నమాట.  ఆలస్యం అయితే కాఫీ చల్లారిపోతుంది. త్వరగా లాగించండి

నవాబ్ మణిరత్నం సృష్టిలోని నవాబ్ అతడు

నవాబ్ మణిరత్నం సృష్టిలోని నవాబ్ అతడు

ఎవరీ నవాబ్? ప్రస్తుతం జనంలో హాట్ టాపిక్ ఇది. మణిరత్నం సృష్టిలోని నవాబ్ అతడు.  విలక్షణుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో ఉన్న నవాబ్ ఎవరు? అన్నదమ్ముల మధ్య కుర్చీ ఆట నేపథ్యంలో సాగుతున్న ఆసక్తికర ఫ్యామిలీ రివెంజ్ డ్రామా ఇదని ట్రైలర్ చూస్తే అర్థమైంది. పోస్టర్లు – ట్రైలర్ తోనే మణిరత్నం ఆసక్తి పెంచగలిగారు. ముఖ్యంగా అరవింద స్వామి లాంటి ఛాలెంజింగ్ పెర్ఫామర్ – శింబు – విజయ్ సేతుపతి – జ్యోతిక లాంటి గ్రేట్ పెర్ఫామర్స్ ఈ సినిమాకి ప్రధాన ఆయుధాలు అన్న కాన్ఫిడెన్స్ మణిరత్నం అభిమానుల్లో ఉంది. నవాబ్ ఎవరు? అన్నది ఇప్పటికి సస్పెన్స్. రౌడీయిజం.. బ్లడ్ .. రొమాన్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. అయినా ప్రతిసారీ ఒకటే సందేహం .. ఇంతకీ నవాబ్ ఎవరు?

తాజాగా `చెట్టు కొమ్మలలో గువ్వల జంట మనం.. గుండె సవ్వడిలో.. ` అంటూ సాగే ఓ కొత్త సాంగ్ టీజర్ ని లాంచ్ చేశారు. ఇందులో శింబు – అరవింద స్వామి – అరుణ్ సాయి లవర్స్ ని పరిచయం చేశారు. ఆ ముగ్గురి ప్రేమకథల్ని ఈ ఒక్క టీజర్ లో చూపించేశారు. పెళ్లికి దూరంగా ఉండే కుర్రాడిగా విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. జ్యోతిక మ్యాడమ్ .. పిల్లను చూస్తానంటూ చెప్పడం చూస్తుంటే విజయ్ బ్రహ్మచారి అని అర్థమవుతోంది. మొత్తానికి ఒక ఫ్యామిలీ డ్రామాలో అన్ని రకాల షేడ్స్ ని నవాబ్ లో చూపిస్తున్నారు మణిరత్నం.

టీజర్ – పోస్టర్లలో అరవింద స్వామి ఘాటైన రొమాన్స్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగమ్మాయ్ అదితీరావ్ హైదరీతో అరవింద స్వామి ఘాటైన రొమాన్స్ వేడి పెంచుతోంది. మరోవైపు జ్యోతికతో అరవింద స్వామి ఎఫైర్ ఏంటి? అన్న సస్పెన్స్ ని లీడ్ చేస్తున్నారు. ఇకపోతే నవాబ్ పాటల్లో బాణీ ఏమంత బాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏ.ఆర్.రెహమాన్ కొత్తగా ట్రై చేస్తున్నా ఏదో మిస్సయ్యిందన్న భావన అభిమానుల్ని వెంటాడుతోంది. నవంబర్ లో నవాబ్ థియేటర్లలోకి వస్తున్నాడు.

రఫ్ గా కనిపిస్తారు కానీ అనగనగనగ అంటూ

రఫ్ గా కనిపిస్తారు కానీ అనగనగనగ అంటూ

ఎన్టీఆర్ అభిమానుల అంచనాల్ని అందుకునే మొదటి సింగిల్ రిలీజైంది. అరవింద సమేత నుంచి అనగనగనగ అంటూ సాగే పాటను లాంచ్ చేసింది చిత్ర బృందం. పాటలో పెప్ ఆకట్టుకుంది. తమన్ బాణీ మెరుపులు మెరిపించింది. స్పైస్ – రొమాన్స్ ని తమన్ బాణీలో ఆవిష్కరించిన తీరు మెచ్చుకుని తీరాలి.

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా అరవింద సమేత చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రణ సాగుతోంది. సెప్టెంబర్ చివరి వారం నాటికి టాకీ పూర్తిచేసి – పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీపూర్తి చేస్తారు. దసరా కానుకగా అక్టోబర్ 10న సినిమా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 20న అరవింద సమేత ఆడియో విడుదల కానుంది. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉందింకా.

తాజాగా  ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సింగిల్ జోరుగా వైరల్ అవుతోంది. అనగనగనగ అరవిందట తనమేరు… అంటూ సాగే పాట తారక్ ఫ్యాన్స్ లో దూసుకెళుతోంది. రఫ్ గా కనిపిస్తారు కానీ..! మాట వింటారు.. ఫర్లేదు!! అంటూ కథానాయిక పూజా హెగ్డే డైలాగ్ తో ఈ పాట ప్రారంభం ఆకట్టుకుంది. తమన్ మరోసారి ఎన్టీఆర్కి అద్భుతమైన బాణీలు అందించారని ఈ పాట చెబుతోంది. తమన్ ఇదివరకూ  బృందావనం – రామయ్యా వస్తావయ్యా – రభస చిత్రాలకు సంగీతం అందించారు. ఈ కాంబినేషన్ లో నాలుగో చిత్రమిది.