రష్మిక చేతి పచ్చబొట్టు

రష్మిక చేతి పచ్చబొట్టు

ఫిలిం ఇండస్ట్రీలో హిట్ ఉన్నవారిపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.  కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘ఛలో’.. ‘గీత గోవిందం’ లాంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  ఇక లైన్లో ఉన్న సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్టులే.  సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్న ‘దేవాదాస్’ రష్మిక హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. నిన్న ‘దేవదాస్’ ఆడియో ఫంక్షన్ జరిగింది.  ఇక ఆ ఈవెంట్ లో చాలామందిని ఆకర్షించిన అంశం ఒకటుంది.

అదే రష్మిక ఎడమ చేతిపై ఉన్న పచ్చబొట్టు. ఇంగ్లీష్ లెటర్స్ లో ‘Irrepleceable’ అనే పదం.  ఇక ఈ ఇర్రిప్లేసబుల్  లో లాస్ట్ ఉండే ‘ఈ’ ఆక్షరం నెత్తి మీద ఒక లవ్ సింబల్ ఉంది.  కొత్త టాటూ కావడంతో అదిప్పుడు హాట్ టాపిక్ అయింది.  తన సహనటుడు కన్నడ ఫిలింమేకర్ అయిన రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత.. బ్రేకప్ విషయం ఇద్దరూ ఓపెన్ అయిన తర్వాత రష్మిక హాజరయిన ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే. దీంతో రక్షిత్ శెట్టి తో బ్రేకప్ విషయం తనకు ఎంతో బాధ కలిగించిందని అందుకే అలాంటి టాటూ వేయించుకుందని కొందరు నెటిజనులు అర్థాలు చెప్తున్నారు.

ఇక రష్మిక ఏ ఉద్దేశంతో ఆ టాటూ ను వేయిచుకుందో మనకు మాత్రం తెలియదు. ఇర్రిప్లేసబుల్ అంటే ఇంపాజిబుల్ టూ రీప్లేస్ అని ఇంగ్లీష్ మీనింగ్ చెబుతోంది గూగులమ్మ. మరి గీతమ్మ ఈసారి ఇంటర్వ్యూలో ఏమైనా దానిగురించి చెబుతుందేమో చూడాలి. అప్పటివరకూ మీకు ఏమనిపిస్తుందో అదే అనుకోండి..!

గీత తనకు బాడీ గార్డ్ అయిందన్న నాగ్

గీత తనకు బాడీ గార్డ్ అయిందన్న నాగ్

‘దేవదాస్’ ఆడియో ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ లో నాగార్జున స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.  నానిపై ప్రశంసల జల్లు కురిపించిన నాగార్జున దేవదాస్ హీరోయిన్లయిన రష్మిక.. ఆకాంక్ష ల గురించి కూడా మాట్లాడాడు.  ఇక టాలీవుడ్ గీత గా మారిన రష్మిక తనకు బాడీగార్డ్ అంటూ అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు.  మరి ‘గీత గోవిందం’ లో విజయ్ దేవరకొండ రక్తం తాగిన ఈ గీత మన్మధుడికి ఎలా బాడీ గార్డ్ అయింది? అక్కినేనివారి మాటల్లోనే..

“ఈ సినిమా లో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్స్ ఉన్నారు. మొన్న మేము థాయిల్యాండ్ నుండి వచ్చేటప్పుడు రష్మిక ఫ్లైట్ లో నా పక్కన కూర్చుంది.  మూడు.. మూడున్నర గంట అలా గడిచిపోయింది.. అంతే కాకుండా నవ్విస్తూనే ఉంది.. అంతే కాకుండా నాకు బాడీ గార్డ్ గా కూడా ఉంది.  నైట్ టైమ్ కదా.. వెనకాల ఉన్నవాళ్ళు ఫుల్ గా తాగి వచ్చారు.  ఇక వాళ్ళ గోల నుండి నన్ను రష్మిక సేవ్ చేసింది… వాళ్ళను రెండు కొట్టింది కూడా.  థ్యాంక్ యు రాష్మిక.. థ్యాంక్ యు ఫర్ బీయింగ్ మై బాడీ గార్డ్.  రష్మిక.. ఐ లవ్ యువర్ ఎనర్జీ..స్మైల్ ఎవిరిథింగ్.  నీకు రెండు హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ‘దేవదాస్’ సినిమాతో హ్యాట్రిక్ చేద్దాం. “

ఇక దేవదాస్ లో తనకు జోడీగా నటించిన ఆకాంక్ష గురించి మాట్లాడుతూ “మొన్న ట్వీట్ కూడా చేశాను ఒక అందమైన అమ్మాయి గురించి.  చాలా రోజుల తర్వాత వైజయంతీ వారు నాకోసం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని జోడీగా తీసుకొచ్చారు.  ఆమె బ్యూటిఫుల్ అమ్మాయే కాదు.. బ్యూటిఫుల్ పర్సన్ కూడా.  నీ గురించి చాలా నైస్ థింగ్స్ చెప్పగలను.. ఆకాంక్ష.. విష్ యూ అల్ ది బెస్ట్.  నువ్వు స్టార్ అవుతావు.”

ట్రైలర్ దేవదాస్

ట్రైలర్ దేవదాస్

ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ప్రేక్షుకుల్లో క్యూరియాసిటీని పెంచిన ‘దేవదాస్’ టీమ్ ఈ రోజు ట్రైలర్ తో వచ్చారు.  “అంతా భ్రాంతియేనా..” పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటే నాని తన క్లినిక్ లో దిగాలుగా ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ షాట్ లో నానిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోతారు.  ఇక అలా ఎందుకు జరిగింది అనేది సస్పెన్స్..!

ఇక నాగ్ “తన పేషెంట్ ని” అంటూ విలన్ గ్యాంగ్ కు పరిచయం చేసుకున్నాడు.  ఇక డాన్ నాగ్.. డాక్టర్ నాని లు ఎందుకు కలిసి ఉన్నారనే విషయం సస్పెన్స్ గా ఉంచుతూనే వాళ్ళ మధ్య జరిగిన ఫన్నీ సీన్స్ చూపించారు.   నాగ్ ‘చీర్స్’ అంటూ పెగ్గేస్తుంటే నాని తన బీపీ ని బీపీ మిషన్ తో తనే చెక్ చేసుకోవడం.. ఫ్రస్ట్రేషన్ లో “ఇలా రోజూ వచ్చి మందు కొట్టడం ఏం బాలేదు” అని అరవడం.. సిట్యుయేషనల్ కామెడీనే.   పెగ్ ఫాస్ట్ గా లేపేసి “ఒకే నేనిక వెళ్ళొచ్చా” అని అడిగితే “చీర్స్ కొట్టకుండా తాగేశావేంట్రా?”  అంటూ నాగ్ ఝలక్ ఇస్తాడు.  ఇలా రచ్చగా సాగింది వాళ్ళ రిలేషన్.

నాగార్జున లవ్ డాక్టర్ అవతారం ఎత్తి స్టెతస్కోప్ తో నాని చెక్ చేస్తూ ‘నీ ప్రాబ్లెం ఏంటో తెలుసా?” అనగానే ఇక నాని లవ్ సీన్స్ స్టార్ట్.   “అయినా నీలాంటివాడికి ప్రేమంటే ఏం తెలుస్తుంది చెప్పు!” అంటూ నాగ్ ని చూసి పకపకా నవ్వుతాడు.. ఇక అక్కినేని వారు తమ రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తీస్తారు.   అంతా ఫన్నే కాదు.. సీరియస్ మాఫియా యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నాగ్ అలా లెఫ్ట్ హ్యాండ్ తో గన్ ని స్టైల్ గా తిప్పడం స్టైలిష్ జెస్చర్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి.   యాక్షన్ సీన్స్ లో యంగ్ & ఎనర్జిటిక్ నాగ్ మళ్ళీ కనిపించాడు. ఇక నాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టెప్స్ కూడా ఇరగదీశాడు.

టోటల్ గా 100% కమర్షియల్ ఎంటర్టైనర్ చూడబోతున్నమనే ఫీల్ ఇచ్చింది ట్రైలర్.  సెప్టెంబర్ 27 కి బుకింగ్ చేసుకోవడం మర్చిపోవద్దే… ప్రతివారం ఇలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాదు కదా!

పెళ్లి గురించి నయన్ లవర్ కామెంట్స్

పెళ్లి గురించి నయన్ లవర్ కామెంట్స్

టాలీవుడ్ – కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార గత కొంత కాలంగా యువ దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొదట వీరిద్దరి ప్రేమ వార్తలను కొందరు కొట్టి పారేశారు. అయితే వీరిద్దరి మద్య పెరుగుతున్న అన్యోన్యం మరియు వీరిద్దరు కలిసి తిరుగుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కారణంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లుగా నిర్థారణ అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. పలు సార్లు నయనతార ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేసింది. తాజాగా విఘ్నేష్ కూడా పెళ్లి విషయమై క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేయడం జరిగింది.

ఈమద్య నయనతార మరియు విఘ్నేష్ లు అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంను సందర్శించడం జరిగింది. ఆ సందర్బంగా తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఒక ఇంగీష్ దిన పత్రికతో విఘేష్ మాట్లాడటం జరిగింది. నయన్ గురించి పలు విషయాలను చెప్పిన విఘ్నేష్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచాడు.

నయన్ తో పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయంలో తప్పించుకునేందుకు పెళ్లి గురించి తనకు ఐడియా లేదు అంటూ సమాధానం ఇచ్చాడు. అదే సమయంలో నయనతారతో ప్రస్తుతం చాలా సంతోషకరమైన సమయంను గడుపుతున్నాను ఆమెను కలవడం అదృష్టంగా భావిస్తున్నా ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు మామూలు సమస్యలు కాదు. వాటన్నింటికి ధైర్యంగా నిలిచి ఆమె పోరాడటం జరిగింది.

ఒక వ్యక్తిగా నయన్ తనకు ఆదర్శనీయం అన్నాడు. ఆమెతో పెళ్లి విషయం నాకు తెలియదు ముందు నయన్ ను అడగాలి ఆ తర్వాత మా అమ్మ అనుమతి కూడా తీసుకోవాలి. అప్పుడు పెళ్లి గురించి మీరు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను అన్నాడు. పెళ్లి గురించి అవగాహన లేకుండానే నయన్ కు ఇష్టం లేకుండానే కలిసి తిరుగుతున్నారా కామెడీ కామెంట్స్ ఆపి నిజం చెప్పు తంబీ అంటూ తమిళ జనాలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

‘నోటా’ వివాదం.. సెటిల్ అయితేనే విడుదల!

‘నోటా’ వివాదం.. సెటిల్ అయితేనే విడుదల!

విజయ్ దేవరకొండ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఈయన తాజాగా నటించిన ద్వి భాష చిత్రం ‘నోటా’. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విజయ్ గత చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ చిత్రాలు విడుదలకు ముందు వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్ విషయంలో గీత గోవిందం పైరసీ విషయంలో మీడియాలో విడుదలకు ముందు హల్ చల్ చేశాయి. ఇప్పుడు ‘నోటా’ చిత్రం కూడా విడుదలకు ముందు మీడియాలో ఒక వివాదంతో హడావుడి చేస్తోంది.

‘నోటా’ చిత్రంకు తెలుగులో తాను డైలాగ్స్ రాశానని కాని దర్శకుడు ఆనంద్ శంకర్ తనకు పారితోషికం టైటిల్ క్రెడిట్ ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడు అంటూ రచయిత శశాంక్ వెన్నెలకంటి మీడియా ముందుకు వచ్చి ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీసులకు కూడా ఈయన ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ‘నోటా’ ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ తాను రాసినవే అని కాని దర్శకుడు ఆనంద్ శంకర్ డైలాగ్స్ తనవి అంటూ టైటిల్ కార్డ్ వేసుకున్నాడు అంటూ శశాంక్ ఆగ్రహంతో ఉన్నాడు. తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వడంతో పాటు టైటిల్స్‌లో తన పేరును చేర్చితేనే సినిమా విడుదల కానివ్వాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఈ విషయమై తమిళ మరియు తెలుగు సినీ పెద్దలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో తాను రాసిన డైలాగ్స్‌ను తెలుగులో శశాంక్ అనువదించాడు తప్ప కొత్తగా అతడు ఏమీ డైలాగ్స్ రాయలేదు అంటూ ఆనంద్ శంకర్ తన వర్షన్‌ను తమిళ మీడియా ముందు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం ఒక కొలిక్కి వస్తే తప్ప సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం లేదు. ఈ చిత్రం విడుదల విషయంలో అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తెలుగులో స్టార్ హీరో గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో మొదటి సారి తమిళనాట ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను అక్కడ ఇక్కడ భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టైం నడుస్తున్న కారణంగా ఖచ్చితంగా ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టనుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాజల్ పిచ్చి పిచ్చిగా..!

కాజల్ పిచ్చి పిచ్చిగా..!

చందమామ చిలౌట్ చూశారా? కుర్ర హీరోతో పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తోంది. నచ్చినట్టు సరదా సరదాగా ఉంటోంది. యువహీరో బెల్లంకొండతో ఆన్ లొకేషన్ ఉందిప్పుడు. లొకేషన్ లోనే ఇదివరకూ కికి ఛాలెంజ్ లోనూ పాల్గొంది. అప్పుడు బెల్లంకొండతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసి ఆ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్ చేసింది.

మారోసారి అదిరిపోయే సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది కాజల్.  టీమ్‌తో జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోల్ని సాయి శ్రీనివాస్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో చందమామ చిలౌట్ పీక్స్ లో ఉంది. తనకు కథానాయికగా తొలి అవకాశాన్నిచ్చిన దర్శకుడు తేజతో – యంగ్ అండ్ డైనమిక్ బెల్లంకొండతో రకరకాల ఫోజులిచ్చింది చందమామ. ఈ ఉల్లాసం – ఉత్సాహం చూస్తుంటే మునుపెన్నడూ కనిపించని గ్లో చందమామలో కనిపిస్తోంది. ఇక బెల్లంకొండ గోపికా కృష్ణుడిగా మారిపోయి చాలానే రచ్చ చేస్తున్నాడు.

కాజల్ ఆలోచనలే డిఫరెంట్. ఓవైపు స్టార్ హీరోలతో నటిస్తూనే – మరోవైపు కుర్రహీరోలకు స్కోపిస్తోంది. తనకు ఇష్టమైన దర్శకులు అడగాలే కానీ – నో చెప్పదు. అలా బెల్లంకొండ-తేజ సినిమాకి కమిటైంది. ఈ తరహాలోనే ఇదివరకూ ప్రశాంత్ వర్మ వినిపించిన ప్రయోగాత్మక స్క్రిప్టుకు ఓకే చెప్పింది. కాజల్ నటించిన `అ!` చక్కని విజయం అందుకున్న సంగతి తెలిసిందే. చందమామ కాజల్ లోని వైవిధ్యానికి ఇదో ప్రూఫ్. ఇక యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉత్సాహం పెంచడం చూస్తుంటే కాజల్ లోని స్పోర్టివ్ నెస్ ని మెచ్చుకోకుండా ఉండలేం.