దేశంలో బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. మొన్ననే కొండగట్టు వద్ద బస్సులోయలోకి పడి 60మంది మృతిచెందారు. ఆ విషాధం దేశ ప్రధాని – రాష్ట్రపతి ని కూడా కదిలించింది. వారు కూడా సంతాపం తెలిపారు. అది మరిచిపోకముందే.. మరో విషాద ఘటన చోటుచేసుకుంది.  

జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వోర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన మినీ బస్సు ఒకటి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాశ్వాన్ నుంచి కిష్త్వోర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం  చోటుచేసుకుంది.  మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చీనాబ్ నది సమీపంలోని 300 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. 

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 13 మంది మరణించగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  సమాచారం అందిన వెంటనే హెలీ క్యాప్టర్ల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. అలాగే చనిపోయిన వారికి రూ.5 లక్షలు క్షతగాత్రులకు రూ.50వేల రూపాయలు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.. ఈ ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.